విద్యార్థులలో అభ్యసనా సామర్ధ్యాలను పెంపొందొంచే దిశగా ఉపాధ్యాయులంతా కృషి చేయాలని నివగాం క్లస్టర్ ప్రధానోపాధ్యాయని ఎస్.నిర్మల అన్నారు. ఎస్.సి.ఇ.ఆర్.టి. నిర్దేశాల మేరకు నివగాం క్లస్టర్ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయులకు నివగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిక్షణా తరగతులు ఆమె అధ్యక్షతన నిర్వహించారు. శిక్షణా తరగతులను ప్రారంభించిన సందర్భంగా నిర్మల మాట్లాడుతూ క్లస్టర్ల ఏర్పాటు ప్రక్రియలో మార్గదర్శక సూత్రాలను పాటించామని, 117 జీ.వో. రద్దు అనంతర పరిస్థితులను విశ్లేషించామని తగు నివేదికను జిల్లా యాజమాన్యానికి పంపామని అన్నారు. మాతల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొంతల వెంకట రమణ, కుంటిభద్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయని ధర్మాన కృష్ణవేణి, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రిన్సిపాల్ పల్ల రాధిక, రీసోర్స్ పర్సన్లు ఉరిటి ఉమామహేశ్వరరావు, అందవరపు రాజేష్, వై.అప్పలనాయుడు, రామకృష్ణ బడిత్య, ఎం.మురళీకృష్ణ, బాలరాజు మహంతి, పి.రామరాజు, ఎం.దామోదర్, పి.ఋషిదాసులు శిక్షణా తరగతులను నిర్వహించారు.
సెకండరీ గ్రేడ్ టీచర్లతో పాటు తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రోపాధ్యాయులందరితో వీరంతా పలు విద్యాభివృద్ధికి దోహదపడు అంశాలను చర్చించారు.
గొర్లె శంకరనారాయణ, కుదమ తిరుమలరావు, జె.లక్ష్మీకాంతం, కె.దయానిధి, ఎన్.ఉషారాణి, గుర్రాల కృష్ణారావు, బూడిద సంతోష్ కుమార్, పైసక్కి చంద్రశేఖరం, యిసై సౌజన్యవతి, బొమ్మాళి నాగేశ్వరరావు, పెయ్యల సుజాత తదితరులు పలు చర్చలలో పాల్గొని తగు నివేదికలు రూపొందించిరి. ఫిబ్రవరి నెల సిలబస్ ను ఏ మేరకు పూర్తి చేసి రివిజన్ నిర్వహించి విద్యార్థులకు గుణాత్మక విద్యను అందజేయాలో శిక్షణార్ధులంతా చర్చించిరి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి