ఏ లోయలో దాగినా
ఏ గిరులలో జారినా
ఏ కోనలో సాగినా
నిను వెదుకుతూ వచ్చే నేస్తం!
నులివెచ్చగా నిను తాకి
నిను వెచ్చగా పలకరించి
నీ తరగల పైనే కాదు
నీ అడుగును తాకగల అభిమానం!
ఏ రాలపై నీ పాదం మోపేవో
ఏ మెలికలు నిను ఆపునో
ఏ మలుపులో నీ దశ తిరుగునో
ఎరిగి నిన్ను వెన్నంటి వుండే ఆత్మీయత!
నీ అడుగుల గలగలలు
నీ పయనపు పదనిసలు
నీ నడకల వయ్యారాలు
అన్నీ గమనిస్తూ మురిసే ఆప్యాయత!
నీతో కలిసే వాగుల వంకల
నీ రాకకై ఎదురుచూచు శిలల
నీ ఒడ్డున పెరిగే గడ్డిపోచల
వివరాలన్నీ తెలుసుకునే ఉత్సాహం!
నీపై కురిపించే కరుణ
నీకు పంపించే కిరణాల
నీ వెంట ఉండి నడిపే తరుణాల
విలువెంతో నీకు తెలుసా?
పసి కూనకు అమ్మలా
పోషించే తండ్రిలా
రక్షించే సోదరుడిలా
కాపుకాసే కర్మసాక్షి....
లోకానికి ఆప్తుడు
కాలానికి కారకుడు
ఆదిమూలమైన ఆ
వెలలేని మిత్రుడున్న కొండవాగూ...
బంగారు తండ్రిని స్వాగతిద్దాం
రావమ్మా! సెలయేరమ్మా....
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి