మోహం ముద్గరం:- కొప్పరపు తాయారు
 

శ్లోకం: బాల స్తావ త్క్రీడా సక్తః
         తరుణ  స్తావ  త్తరుణి సక్తః !
         వృధ్ధ.   స్తావ   చ్చింతా సక్తః
         పరమే  బ్రహ్మణి కోపిన సక్తః !!

భావం: మనుజునకు బాల్యకాలము ఆటలయందు గడిచిపోవుచున్నది. యవ్వనము 
వనితాది విషయములు యందు గరుచుచున్నది. 
వార్థక్యము అనేక చింతల తో గడిచిపోవు చున్నది. ఇక పరబ్రహ్మము నందు ఆసక్తి కలవాడు ఎవరు లేరు. అట్టివారు అరుదు అని భావం. 
                *****

కామెంట్‌లు