9వ తరగతి తెలుగు సిలబస్ పూర్తి అయింది. రివిజన్ వర్క్ జరుగుతుంది. ఉపాధ్యాయుడు శతక మధురిమ పాఠంలో 7 నీతి పద్యాలు మరియు భావాలు ఈ రెండు రోజులు చదివి, మూడో రోజు చూడకుండా రాయాలి అని చెప్పాడు. ఈ రెండు రోజులు తెలుగు పీరియడులో పూర్తి సమయం చదివిస్తా ఆ తర్వాత రోజున పరీక్ష అని చెబుతాడు. గీతాంజలి అనే అమ్మాయి లేచి "బాబోయ్! 7 పద్యాలు మరియు భావాలా? మా వల్ల కాదు." అన్నది. అప్పుడు తెలుగు ఉపాధ్యాయుడు "ఇంతకు ముందు మీరు నేర్చుకున్న పద్యాలే కదా! పైగా రెండు రోజులు చదివిస్తున్నా. రాదంటే ఎలా?" అన్నారు. "7 పద్యాలు నేర్చుకోవడం మా వల్ల కాదు. కావాలంటే 3 పద్యాలు రాసి చూపిస్తాం." అన్నది స్రవంతి.
ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఆస్ట్రేలియా 350కి పైగా చేసింది. ఇండియా ఆ టార్గెట్ ఛేదించలేక ఓడిపోయింది. తర్వాత రోజు తెలుగు ఉపాధ్యాయుడు 9వ తరగతిలో "ఇంటికి ఇచ్చిన హోంవర్క్ పక్కన పెట్టి, నిన్న క్రికెట్ మ్యాచ్ చూసిన వాళ్ళు కొందరు ఉన్నాలె." అన్నాడు. "చెత్త ఆట. ఆ ఆట గురించి తలచుకోవడం టైం వేస్ట్." అన్నది అలివేలు. "అంత భారీ స్కోర్ ఛేదించడం చాలా కష్టం కదా." అన్నాడు వాసు మాస్టర్. "ఎందుకు కస్టం సర్! మొదటి ఓవర్ నుంచి ప్లాన్ ప్రకారం ధాటిగా ఆడుతూ ఉంటే ఎంత పెద్ద లక్ష్యాన్ని అయినా ఛేదించవచ్చు. నా వల్ల కాదు అంటే ఇంతే ఉంటుంది." అన్నది గీతాంజలి. "అవును కదా! ఇదే విషయం మీ చదువుకు ఎందుకు వర్తించదు? ఇంతకు ముందు నోటిని వచ్చిన పద్యాలు మరియు భావాలు రెండు రోజుల సమయం ఇచ్చినా రాదని అన్నారు. మీరు నీతులు చెబుతునారా? నా వల్ల కాదు అంటే ఏదీ కాదు. ప్రయత్నం చేస్తే అన్నీ సాధ్యమే." అన్నారు వాసు మాస్టర్. తల దించుకున్నారు విద్యార్థులు. క్షమించమని వేడుకున్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి