ఆమెకు
అక్షరమే ఆయుధము
ప్రాసలే ప్రాణము
ఆమెకు
పోలికయే భూషణము
శైలే ఆలవాలము
ఆమెకు
ఆలోచనలే ఆధారము
విషయమే ప్రధానము
ఆమెకు
మదులుదోచటమే ముఖ్యము
నిత్యప్రవాహమే ఇష్టము
ఆమెకు
మధురగళాలే ఆవాసము
నవ్వులుచిందించటమే ఆశయము
ఆమెకు
తీపినందించటమే సంతోషము
అందాలుచూపించటమే ఆనందము
ఆమె
కలాల ప్రవాహము
కాగితాలకు అలంకారము
ఆమె
ఆకర్షణకు ఆద్యము
మరోలోకానికి మార్గము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి