న్యాయములు-765
అంగుల్యగ్రే మత్త మాతంగా శ్చరన్తి న్యాయము
******
అంగుల్యగ్రే అనగా వేలు చివరి, వేలి కొనపైన.మత్త అనగా మత్తెక్కినది,గర్వించినది, మిక్కిలి సంతోషించినది,స్వేచ్ఛాచారి, మదించిన ఏనుగు, పిచ్చివాడు.మాతంగా అనగా ఏనుగు. శ్చరంతి అనగా తిరుగు అని అర్థము.
"నా వ్రేలి కొనపైన మదించిన ఏనుగులు తిరుగుచున్నవి" అని చెప్పినట్లు.నమ్మదగని,గ్రహింప దగని మాటలు మరియు వాక్యములను మాట్లాడే వారి విషయంలో మన పెద్దవాళ్ళు ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు .
అనగా కోతల రాయుల విషయంలో అనగా నమ్మశక్యం కాని ముచ్చట్లను చెప్పి నమ్మించే ప్రయత్నం చేసే వారి విషయంలో పెద్దవాళ్ళు తరచుగా ఉపయోగించే న్యాయము ఇది.
మరి అలాంటి నమ్మదగని ముచ్చట్లేమిటో తెలుసుకుందాం...
కొంతమంది తమకు తామే చాలా తెలివైన వారిమి అనుకుంటూ ఎదుటివారిని వెర్రి వెంగళప్పలను చేసేందుకో, తమంత గొప్ప వారు లేరని ఒప్పించేందుకో విషయాన్ని గోరంతలు కొండంతలు చేసి చెబుతుంటారు.అసలు విషయం అడుగున పడేలా చేస్తారు.
ఇదిగో అలాంటి దానికి సరదా ఉదాహరణ. ఒకానొక వ్యక్తి తన చేలో పిల్లి పెసర కాయ పండిందని చెబితే "ఏవీ పట్టుకొని రా! అని మరొక వ్యక్తి అడిగాడట.అప్పుడా వ్యక్తి తెద్దామనే అనుకున్నాను కానీ అది మోకాలి పిక్కంత లావుగా ఉంది. తెద్దామంటే దర్వాజాలో పట్టడం లేదు అన్నాడట. అలా వుంటాయన్న మాట కొందరి మాటల తీరు. వీటినే లేత లేత సొరకాయ కోతలు కోయడం అంటారు.
ఇలా కోతలు కోసే వారి గురించి శ్రీ శ్రీ గారు సరదాగా అలాంటి పనులు చేయవద్దని రాసిన పేరడీ పద్యం చదివి ఆనద్దిద్దామా...
"ఏరకుమీ కసుగాయలు...అన్న సుమతీ శతక పద్యాన్ని "కోయకుమీ సొరకాయలు/వ్రాయకుమీ నవలలని అవాకు చెవాకుల్/ డాయకుమీ అరవ ఫిలిం/చేయకుమీ చేబదుళ్లు సిరిసిరి మువ్వా!"
"చెప్పే వాడికి వినేవాడు లోకువ అన్నట్లు" నిజంగా ఎంత లోకువ అయినా చెప్పే దాంట్లో కనీసం పిసరంతైనా నిజం లేకపోతే ఎవరూ నమ్మరు.
"వ్రేలి కొనమీద మదించిన ఏనుగులు తిరుతాయా?తిరుగవు.అస్సలు తిరుగవు కదా! అయినా ఇదిగో ఇలా కూడా చెప్పేవారు ఉంటారు.
ఇదంతా చూసే మన పెద్దలు ఇలాంటి న్యాయాలను సృష్టించారేమో అనిపిస్తుంది.
ఇవి వినడానికి చాలా సరదా వుంటాయి
"కోటలు దాటిన మాటలు - గడప దాటని చేతలు" వీటి వల్ల ఆయా వ్యక్తులు నవ్వులపాలు అవుతుంటారు. కాబట్టి మాటలు కోటలు దాటేంత సొరకాయ కోతలు కావద్దు.అలాగే చేతలు ఆరంభ శూరత్వం కాకూడదు. ఇదండీ! ముఖ్యంగా ఈ న్యాయము ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి