భక్తిపారవశ్యఆనందార్ణవం:- కోరాడ నరసింహా రావు!
ఇది భారతీయఆద్యాత్మ వైభవం..! 
   మన జన్మ లో కేవలం ఒకేమారు వచ్చేఅరుదైన అద్భుత అవకాశ0..!! 
  
అది ప్రయాగ్రాజ్...! 
   త్రివేణి సంగమ పుణ్య స్థలిలో....జరుగుతున్న కుంభ మేళా...!! 
    కోట్లాదిగా భక్తులు, సాధు,సంతులు,మునులు, యోగులు,అ ఘోరాలు, నాగసాధులు... 
 సందర్శకులు తరలి వచ్చు తరుణమిది...!
  వారు ఎటునుండివస్తారో ఎలావస్తారో...భస్మధారులు, జడ ధారులు, కపాళ ధారులును... విచిత్ర వేషధారులు...! వింత- వింత ప్రవర్తనలు !! 
  
ఇది సకల పాపములను తొలగించు పుణ్య తీర్ధ  స్నానసమయం..!!
  ఎన్నడూఎవరికీ కలుగని అద్భుత అనుభూతి..!!

అన్ని పుష్కర స్నా న ములలోనూ అత్యంత పవిత్ర మైనది...ఈ కుంభ మేళ...! 
      పుష్కరునితో కలిసి సకల దేవతలూ త్రివేణిలో భక్తులను అనుగ్ర హించు అరుదైన సమయం..!! 
  
ప్రత్యేక వార్తలకై వెదకు మీడియా డేగకళ్లు.... 
    ఆదిగో అక్కడ చిక్కెను పూస లమ్ముకునేఅందాల ఆడ పక్షి...! 
  వచ్చినపని మరచి, వివేకము విడచి... 
    బెల్లం చుట్టు ఈగల్లా... 
 ఛీ మల్లా...వెంటపడ్డవెర్రి!

పవిత్ర స్థలంలో...అనుకోని అపవిత్రం...! 
 ఆ పిల్లకైతే  ఊహించని అదృష్టావకాశ0...!!

 ఎన్ని అపశ్రుతులు దొర్లిన, 
  ఎవరే పోకిరీ పనులు చేసినా... క్షేత్ర మహిమ వన్నె తగ్గదు...! 
    తీర్ధ ప్రాశస్త్య వాసి పెరుగునే తప్ప...! 
      *******

కామెంట్‌లు