ఎదురుచూచు చూపులో
వెలుగులను నింపి
తరలి వచ్చు మిత్రుని
కదలక చూచే ప్రకృతి!
మెరుపులన్నీ మోమున నిలిపి
అల నింగిని ప్రభవించే
ఆదిత్యుని స్వాగతిస్తూ
గలగలమని స్తుతించే పచ్చనాకులు!
కెరటాల కరములతో
అలల దోసిలి నింపి
ఆర్ఘ్య పాద్యాచమనాలు
అందించే అంబుధి!
వేదగోష్టి సలిపి
వేదవేద్యుని వేనోళ్ల కీర్తించి
వేలుపులా విచ్చేసి
ఏలికలా రక్షించమనే వృక్షములు!
అందముగా రంగవల్లులు తీర్చి
అలరించు రంగులతో
ఆనందము వెల్లివిరియ
అర్కుని ఆహ్వానించు అంబరము!
అవని అణువణువూ
నవ చేతనత్వము పొంది
అంతర్యామికి అంజలి ఘటించు
అపురూప దృశ్యము...
కనులకు విందుగా
మనసుకు ధైర్యంగా
తనువుకు ఉత్సాహంగా
తరలివచ్చు తరళాత్మునికి
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి