నొప్పించక తానొవ్వక ఉండటం అసాధ్యం.అబద్ధాలాడకుండా నిజంచెప్పి మన్ననపొందిన కవి హేమచంద్రుడు. తిరుమల రాయలకు పొగడ్తలంటే మక్కువ.ఎవరుపొగిడినా సన్మానం చేసేవాడు.ఆయన ఏకాక్షి. హేమచంద్ర కవికి అసత్యం అతిశయోక్తులు ఇష్టంలేదు.అందుకే"అన్నాతి గూడ హరుడవు
అన్నాతిని గూడనప్పుడసుర గురుడవే
అన్నా!తిరుమల రాయా
కన్నొక్కటి కలిగె గాని కౌరవ పతివే"
ఈపద్యంలో చమత్కారం శివుడు శుక్రాచార్యుడు ధృతరాష్ట్రుడు అని రాజుని పొగడటం.మహాభారతం ని కొందరు ఇలా వ్యాఖ్యానించారు.పంచపాండవులు పంచప్రాణాలు.ద్రౌపది జీవాత్మ. కౌరవులు నాడులు. యుద్ధం ఉపాసన.మహాప్రస్థానం పరమపదం.జీవాత్మ అర్జునుడు పరమాత్మ కృష్ణుని సాయంతో జ్ఞానాస్త్రంతో అజ్ఞాన కౌరవుల్ని చంపాడు .ధృతరాష్ట్రుడు అహంకారం బుద్ధి విదురుడు ధర్మం సంప్రదాయం భీష్ముడు.వెదురు చెట్టు ఉపయోగం పలువిధాలుగా ఉంటుంది.హిమాలయాల్లో హణ్వుడు అనే మహర్షి ఘోర తపస్సుకి పుట్టపెరిగింది. దానిలోంచి వెదురు మొక్క మొలిచి ఏపుగా ఎదిగింది. బ్రహ్మ వరాన్ని ప్రసాదించాడు మునికి. ఆపై వెదురుతో రెండు ధనస్సులు చేశాడు.ఒకవిల్లుని విష్ణువుకు రెండోది శివునికిచ్చాడు.అలా పినాకపాణి అయినాడు శివుడు🌷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి