విజయగౌరి విజయానికి సహకరించండి.

  శాసనమండలి ఎన్నికల్లో పిడిఎఫ్ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోరెడ్ల విజయగౌరిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చౌదరి రవీంద్ర కోరారు. మండలంలో పలు ప్రాంతాల్లో ఆయన అధ్యాపకుల్ని, ఉపాధ్యాయులను కలుసుకొని విజయ గౌరి సేవలను వివరిస్తూ, ఆమెకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. విజయగౌరికి మద్దతుగా కుంటిభద్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, లబ్బ ఎపి ట్రైబల్ వెల్పేర్ ఆశ్రమ పాఠశాల, గొట్టిపల్లి పాఠశాలలందు పర్యటించి ఆయన ప్రసంగించారు. నిస్వార్థమైన సేవలతో, నిరంతర పోరాటాలతో, నిష్కల్మషమైన కృషితో న్యాయపరమైన డిమాండ్ ల సాధనకై శ్రమించే కుటుంబ నేపథ్యమున్న కోరెడ్ల విజయగౌరిని గెలిపించాలని రవీంద్ర అన్నారు. 
యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ దండు ప్రకాశరావు మాట్లాడుతూ
ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో శ్రమిస్తున్న ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మరియు మిత్రసంఘాలు బలపర్చిన పీడిఎఫ్ అభ్యర్థి విజయగౌరిని గెలిపించాలని అన్నారు. మండల శాఖ అధ్యక్షుడు కె.విజయకుమార్ మాట్లాడుతూ ఇప్పటివరకూ శాసనమండలికి పీడీఎఫ్ తరఫున పద్నాలుగు మందిని గెలిపించి పంపించడం జరిగిందని అదే విధమైన మద్దత్తునివ్వాలని అన్నారు. నిజాయితీ నిబద్దతలతో కూడిన సేవలనందించి సత్ఫలితాలను అందజేయుటకై తపిస్తున్న విజయగౌరిని పెద్ద మెజారిటీతో గెలిపించాలని యుటిఎఫ్ నేతలంతా కోరారు. ఈ పర్యటనలో మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శిలు కె విజయకుమార్, వి.మధు, యమ్.కొండయ్య, డి.ప్రకాశరావు, జిల్లా కౌన్సిలర్లు కుదమ తిరుమలరావు, తూతిక సురేష్, సిఐటియు నాయకులు సిర్ల ప్రసాద్  తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు