శివానందలహరి:- కొప్పరపు తాయారు

 శ్లోకం: సర్వాలంకార యుక్తాం సరల పదయుతాం సాధువృత్తాం సువర్ణాం 
సద్భిః సంస్తూయ మానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యాం !
ఉద్యధ్బూషా విశేషాముపగత వినయం ద్యోత మానార్థ రేఖాః 
కల్యాణీం దేవగౌరీప్రియ మమ కవితా కన్యకాం త్వం గృహాణ !!

 భావం: ఓ గౌరీ ప్రియా! కళ్యాణి అయినా నా కవితా కన్యకను నీవు స్వీకరించుము. ఆమె సర్వాలంకారములు కలది. సరళమైన పదములు ఉన్నది. మంచి ప్రవర్తన కలది ‌‌. మంచి వర్ణము కలది‌.  బుద్ధిమంతులచే పొగడ బడునది. సరస గుణములు ఉన్నది. లక్షణములు కలది. ప్రకాశించు ఆభరణములు ధరించినది. వినయము కలది మరియు స్పష్టమైన అర్థరేఖ కలది. 
            ******

కామెంట్‌లు