సుప్రభాత కవిత : -బృంద
వెతలకు వెరచి దాక్కున్నా
వెదుకుతూ వచ్చి తాకి 
వెరపెందుకు నేనుండగా 
వెలుగులోకి తీసికెడతానని....

ఎంతకీ వేకువ రాదేమని 
ఎదురుచూచి  నిదురలేక 
అలిగి ముసుగుపెట్టిన
అంతరంగాలను బుజ్జగించాలని...

ఊహల ఊయల  ఎక్కి 
ఉత్సాహంగా  ఊగాలని 
ఉవ్విళ్ళూరు హృదయాలకు 
ఊపే నేస్తం నేనంటూ చెప్పాలని....

నన్నెవరు చూస్తారని 
నాకెవరున్నారని 
నిస్పృహలో నిస్తేజంగా 
నేలనున్న రాయిని తాకాలని..

పచ్చని పచ్చిక పై 
పవళించిన  చీకటిని 
పసిడి వెలుగులు ప్రసరించి 
పరుగులు తీయించాలని...

వచ్చే తొలివెలుగు రేఖలకు 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు