సమాజం సమస్యల వలయము
అవినీతి అక్రమాల నిలయము
దిక్కుమొక్కులేని జనారణ్యము
స్త్రీలకు సంరక్షణ లేని వైనము
జ్ఞానం తరిగి అజ్ఞానం పెరిగింది విఠల!
జబ్బులు కొని తెచ్చుకుంటున్నారులే
డబ్బులతో చదువు"కొంటున్నారు"లే
గబ్బు పనుల్జేసి కులుకుతున్నారులే
పబ్బు క్లబ్బుల మబ్బులో వున్నారులే
అడవి మృగాల్ని తలపిస్తున్నారు విఠల!
కులాల రొచ్చులో కూరుకొని పోయి
మతాల చిచ్చులో ఇరుక్కొని పోయి
అడంబరాల్లో తైతక్కలాడకోయి
బతుకులు బజారున పడునోయి
మానవత్వం మంట కలుపకు విఠల!
నోటుకు ఓటును అమ్ముకోకురా
నీ వేలితో కన్ను పొడుచుకోకురా
స్వార్థంకై నేతల బూటు నాకకురా
నీ బతుకు నరకం చేసుకోకురా
ఇకనైనా మంచిగా మసలుకో విఠల!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి