చింతకుంటలో ఘనంగా ప్రపంచ ఆలోచనా దినోత్సవ వేడుకలు


  భారత్ స్కౌట్స్ & గైడ్స్ జిల్లా అసోసియేషన్ , కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలోశనివారం  జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ జనార్ధనరావు గారి ఆదేశానుసారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చింతకుంటలో ప్రపంచ ఆలోచనా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.జిల్లాలోని స్కౌట్ మాస్టర్లు మరియు గైడ్ కేప్టన్లు మరియు విద్యార్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమ వ్యవస్థాపకులు లార్డ్ బెడన్ పావెల్ మరియు లేడీ బెడన్ పావేల్ పుట్టినరోజును  పురస్కరించుకొని ప్రపంచ ఆలోచనా దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ  కార్యక్రమం జెండా ఆవిష్కరణ మరియు సర్వ మత ప్రార్థనతో ప్రారంభమైంది, ఇది ఐక్యత మరియు శాంతికి సంకేతంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కమీషనర్ శ్రీ జి లక్ష్మీనారాయణ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి టి శోభారాణి గారలు పాల్గొన్నారు.లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ 
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 22న నిర్వహించబడే ప్రపంచ ఆలోచనా దినోత్సవం విద్యార్థులలో నాయకత్వం,శాంతి మరియు అంతర్జాతీయ స్నేహాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడుతుంది అని అన్నారు.జిల్లా కార్యదర్శి శ్రీ కంకణాల రాంరెడ్డి గారు మాట్లాడుతూ "సేవా స్పూర్తి, బాధ్యత మరియు ప్రపంచ పౌరసత్వం అనే స్కౌటింగ్, గైడింగ్ విలువలను విద్యార్థులు అనుసరించాలని కోరారు.జిల్లా ఆర్గనైజింగ్ కమీషనర్ శ్రీ అడిగొప్పుల సదయ్య ఇటీవల తమిళనాడులో జరిగిన వజ్రోత్సవ జంబోరీలో పాల్గొని ఎన్నో అవార్డులు పొందిన విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఇటీవల తమిళనాడులో జరిగిన జాతీయ జంబోరిలో పాల్గొని మన రాష్ట్రానికి ఉత్తమ గ్రేడులు రావడానికి కృషిచేసిన జి లక్ష్మీనారాయణ,అడిగొప్పుల సదయ్య,చిగిరి ఇందిర,శ్రావణ్ కుమార్,రజిత గారలను జిల్లా అసోసియేషన్ తరుఫున జిల్లా కార్యదర్శి రాంరెడ్డి, జిల్లా ట్రైనింగ్ కమీషనర్ షరీఫ్ అహ్మద్ లు ఘనంగా సన్మానించడం జరిగింది, విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీమతి స్వప్న, జిల్లా ట్రైనింగ్ కమీషనర్ మౌనిక, జిల్లా ఆర్గనైజింగ్ కమీషనర్ రజితలతో పాటు వివిధ కెజిబివి గైడ్ కేప్టన్లు మరియు ప్రైవేటు పాఠశాలల స్కౌట్ మాస్టర్లు, స్కౌట్స్ అండ్ గైడ్స్  పాల్గొన్నారు.
కామెంట్‌లు