సుప్రభాత కవిత : -బృంద
రేయిని గెలిచిన తూరుపు 
వేయిగ వెలుగే నిలిపి 
హాయిగ జగతిని బ్రోచు!

కలలకు రూపం ఇచ్చి 
కనులకు పండుగ తెచ్చి 
కలతల వ్యధలే  తీర్చు!

సోకిన చోట స్వర్ణంలా 
తాకగ మెరిసే ధరణి 
వాకగ సంతోషం తెచ్చు!

వేచిన మొగ్గలు విరిసేలా 
కాచిన తీగలు మురిసేలా 
చుక్కలు ముంగిట విచ్చు!

చినుకు చినుకుగా  జారే 
కనక ధారను బోలి
గరిక రెమ్మకు గరిమను కూర్చు!

గువ్వకు రెక్కలు ఒసగి 
పువ్వుకు పరిమళమలది 
నవ్వును నరునికి ఇచ్చు!

సహనమే శక్తిగా 
మౌనమే ఆయుధంగా 
తృప్తిని సంపదగా మలిచే 

కొత్త వెలుగులకు 

🌸🌸 సుప్రభాతం 🌸🌸

 

కామెంట్‌లు