తెలుసుకుందాం! సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 షట్ పుత్రులు ఎవరంటే ఠక్కున జవాబు తట్టదు మరీచి మహర్షికి 6గురు కొడుకులు.బ్రహ్మ లోకంలో  సరస్వతీదేవిని చూసి హేళనగా నవ్వారు.బ్రహ్మ కి కోపంవచ్చి" మీరు ఎబ్బెట్టు హేళనగా నవ్వటం  అసురలక్షణం. దానవులుగా పుట్టండి" అని శపిస్తాడు. "మీతండ్రి చేతనే చంపబడతారు ". తర్వాతి జన్మ లో  కాలనేమి కంసుడుగా పుట్టాడు.ఈ6గురు చెరసాల లో దేవకిగర్భంలో పుట్టడం కంసుడు చెల్లి పిల్లల్ని సంహరించటం జరిగింది.వారు శ్రీకృష్ణునికి ముందు దేవకీవసుదేవుల కుమారులుగా పుట్టడం జరిగింది.
కంసభక్తి  అనేపదం ఉంది.కృష్ణునిమేనమామ దేవకి అన్న కంసుడు క్రూరుడు.రాజ్యకాంక్షతో తండ్రిని జైల్లోపెట్టాడు.దేవకికి పుట్టిన కృష్ణుడు తనను చంపుతాడని అనుక్షణం భయపడుతూ జీవించాడు. దీన్ని వైరభక్తి అంటారు.కూచున్నా తింటున్నా నిద్రపోతున్నా సదాకృష్ణ స్మరణే."శ్రవణ రంధ్రంబుల నే శబ్దంబు వినబడు" అనే పద్యంలో  పోతన వర్ణనలో కంసుని మానసిక స్థితి చక్కగా ద్యోతకమవుతుంది. త్వరగా మోక్షం పొందాడు.పుణ్యం కోరితే మంచి భోగభాగ్యాలు ఉన్నత పదవులు లభిస్తాయి.కానీ ముక్తిరాదు.పునరపి జననం పునరపి మరణం తప్పదు.మోక్షం అంత తేలిక కాదు.దైవంపై వైరంతో సదా నామస్మరణ తో కంసుడు జీవన్ముక్తుడైనాడు.
కామెంట్‌లు