పిడీఏఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరిని గెలిపించండి

  ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యుటిఎఫ్ మరియు అధ్యాపక సంఘాలు బలపరిచిన పిడిఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరిని గెలిపించాలని యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ దండు ప్రకాశరావు అన్నారు. ప్రకాశరావుతో పాటు జిల్లా కార్యదర్శి జి.మాధవరావు, మండల అధ్యక్షులు కె.విజయకుమార్ తదితరులు ఉపాధ్యాయ, అధ్యాపకులను కలిసి విజయగౌరికి విజయాన్ని చేకూర్చాలని కోరారు. ఈ సందర్భంగా 
మెట్టూరు లో విలేకరులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
విజయగౌరి విద్యార్థి దశ నుంచే ఎస్ఎఫ్ఐ ఉద్యమాల్లో పాల్గొని విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నాయకత్వం వహించారని గుర్తుచేశారు. తన 34 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తిలో మొదటి నుండి ఉపాధ్యాయ ఉద్యమాల్లో పాల్గొని,
విద్యారంగ పరిరక్షణకు, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేశారని వారు తెలిపారు. ఉపాధ్యాయల, అధ్యాపకుల, ఏపీ మోడల్ స్కూల్ టీచర్ల, కాంట్రాక్టు లెక్చరర్ల, మున్సిపల్ టీచర్ల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల, అధ్యాపకుల అనేక సమస్యలు పరిష్కారానికి కృషిచేసిన చరిత్ర విజయగౌరి సొంతమని వారన్నారు.
నీతి నిజాయితీ కలిగి, ఎందరో విద్యార్థులను ఎంతో ఆదర్శప్రాయులుగా తీర్చిదిద్దారని తెలిపారు..
ఎన్నికల్లో రాజకీయ పార్టీలు జోక్యం తగదని, రాజకీయ నాయకులు పాఠశాలలుకు వచ్చి  ప్రచారం చేయడం సరైంది కాదని అన్నారు. ఉపాధ్యాయులకు మాత్రమే జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉపాధ్యాయులు, అధ్యాపకులకే పరిమితం అవ్వాలని, ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీల జోక్యాన్ని తామంతా తీవ్రంగా ఖండిస్తున్నామని వారున్నారు.
ఈ పత్రికా విలేఖరులతో జరిగిన సమావేశంలో రాష్ట్ర కౌన్సిలర్ దండు ప్రకాశరావు, జిల్లా కార్యదర్శి జి.మాధవరావు, మండల అధ్యక్షులు కె.విజయకుమార్, జిల్లా కౌన్సిలర్ ఆర్.ఆర్.ఎం. కొండలరావు, మండల కోశాధికారి బి.భద్రయ్య, కార్యదర్శి పి.దినేష్ మరియు సిఐటియు నాయకులు సిర్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు