లోకాన లౌక్యమెక్కువాయె
వ్యవహారమే జ్ఞానమను
తెలివి జాస్తియయ్యెను
కావుమా!శ్రీ రాజరాజేశ్వరా!
స్వచ్ఛమను మాట కరువాయె
స్వేచ్ఛయే నిజమను
భ్రాంతి యధికమయ్యెను
బ్రోవుమా!శ్రీ రాజరాజేశ్వరా!
ధనమే ముఖ్యమాయెను
దానము చేయుట తగదను
అజ్ఞానము ఖాయమయ్యెను
పాహి పాహి శ్రీ రాజరాజేశ్వరా!
దైవమే జూదమాయె
దనుజత్వమే దారియను
మూర్ఖత్వము రూఢియయ్యెను
రక్ష రక్ష! శ్రీ రాజరాజేశ్వరా!
ఆర్భాటాలు కర్తవ్యమాయెను
అందని మ్రానిపండ్లే
ఆశలను భావమబ్బెను
కనికరించు!శ్రీ రాజరాజేశ్వరా!
ప్రేమ యన్నది ఉదాసీనమయ్యె
ద్వేషమే పెరుగుచుండె
అశాంతి ఆవరించెనెల్లెడల
కదలిరమ్ము!శ్రీ రాజరాజేశ్వరా!
మోహమే స్థిరమాయె
మోక్షజ్ఞానము మిథ్యగుచుండె
కనికట్టుల కాలము నడుచుచుండె
సరిచేయుము!శ్రీ రాజరాజేశ్వరా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి