ఉగ్గు పాలతో
లాలి, జోల పాటలతో
అమ్మ నేర్పిన భాష
కమ్మ నైనది...!
******
విన సొంపుగ
పలుకులలో మాధుర్యం
అందమైన అజంత
తెలుగు భాష...!
*****
వేరే భాషకూ లేని
పద్య పరిమళమును
గుభా ళించు
మన మాతృ భాష...!
******
ప్రాంతీయమాండలికాలు
పండిత, పామర
జన రంజకం
మన మాతృ భాష...!
*****
కృష్ణ రాయల చేత
కొనియాడ బడినది
మధుర మైన
తెలుగు భాష...!
******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి