అక్క బడికి వెళ్ళేవరకూ
అక్కా..అక్కా ..అంటూ
చుట్టూ తిరుగుతాడు ...
అమ్మ -నాన్నలు
ఆఫీసుకి వెళ్లేవరకూ ...
అమ్మమ్మ -తాతల వైపు
కన్నెత్తి చూడడు ....!
అందరూ -
బయటకివెళ్ళగానే
తాత మీదపెడతాడు
తనదృష్టినంతా ....!
అమ్మమ్మతో -
అన్నిపనులు ,
చేయించుకుంటాడు
దగ్గరికివస్తే -అమ్మమ్మను
దూరంగా నెట్టేస్తాడు ...!
సంరక్షరాలుని -దినమంతా
సర్కసుచేయిస్తాడు ....
మా బుజ్జి మనవడు
మా..ముద్దుల నికోబాబు ...!!
***
క్షణం ..క్షణం ...!!: -డా.కె.ఎల్.వి.ప్రసాద్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి