తెలుగు కనబడాలి - తెలుగు వినబడాలి

 తెలుగు రాష్ట్రాల్లో తెలుగు కనబడాలని, తెలుగు వినబడాలని పాతపొన్నుటూరు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు అన్నారు. ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో ఏర్పరిచిన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఇతర భాషలను గౌరవిస్తూనే మన మాతృభాషకు ప్రాధాన్యతనివ్వాలని కృష్ణారావు అన్నారు. పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న బొమ్మాళి నాగేశ్వరరావును ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా సన్మానించారు. తెలుగు అంశాలపై నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఏడతరగతి విద్యార్ధిణి లంక చాందినికి జ్ఞాపికను బహూకరించి సత్కరించారు. తన రచనలను ప్రచురించియున్న హంసవాహిని అనే సంకలనాలను కుదమ తిరుమలరావు ఉపాధ్యాయులందరికీ బహూకరించారు. 
ఈనాటి కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు, ఉపాధ్యాయులు అందవరపు రాజేష్, బూడిద సంతోష్ కుమార్, పైసక్కి చంద్రశేఖరం, యిసై సౌజన్యవతి, బొమ్మాళి నాగేశ్వరరావు, కుదమ తిరుమలరావులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం మిఠాయి పంపకం జరిగింది.
కామెంట్‌లు