ప్రేమ అనేది
ఇచ్చేదికాదు
పుచ్చుకునేది
కాదంటావునువ్వు !
--------------------------
ప్రేమంటే ....
ఇచ్చిపుచ్చుకోడంకంటే ......
ఇద్దరిలోనూ సహజంగా
పుట్టాలంటావు నువ్వు !
----------------------------------
ప్రేమ పుట్టాలంటే
సాన్నిహిత్యంతో....
దగ్గరి తనం ఏర్పడి
ఆకర్షణకు అంకురార్పణ జరగాలి!
----------------------------------------------
ప్రేమ అనేది నిజమైతే
అది శాశ్వతం కావాలి!
మోహమేప్రధానంగా
మూన్నాళ్లముచ్చట కారాదు!
------------------------------------------------
యవ్వనం రగిలించే
అల్లకల్లోల స్పందనలు
ఆకర్షణల మత్తు.....
ప్రేమకు గీటు రాళ్లు కానే కాదు!
--------------------------------------------------
నువ్వన్నట్టు....నిజంగా
ప్రేమపుట్టడం అనేది
అంత శుళువు కాదు!
హృదయమధనం తోనే అదిసాధ్యం!
------------------------------------------------
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి