ఓ పెద్దాయన ఓ కుర్రాడితో మాట్లాడుతూ ఓ చిట్టి కథ చెప్పారు.
నాలోపల రెండు తోడేళ్ళుండేవి.
ఒక తోడేలులో కోపం, ద్వేషం, అసూయ, అవమానం, అబద్ధాలు ఉండేవి.
మరొక తోడేలులో ప్రేమ, సంతోషం, సత్యం, శాంతి, ప్రశాంతత ఉండేవి.
దాంతో ఈ రెండు తోడేళ్ళ మధ్య ఘర్షణ...రెండింటి అభిప్రాయాలూ ఆలోచనలూ భిన్నంగా ఉండేవి. దాంతో మానసిక సంఘర్షణ... అని పెద్దాయన చెప్పారు.
కుర్రాడు ఆయన చెప్పినదంతా విని క్షణం ఆగి "అయితే ఆ రెండింటిలో ఏది గెలిచేది" అని అడిగాడు.
అప్పుడా పెద్దాయన "ఏది దేనిని ఎక్కువగా అనుసరిస్తుండేదో దానిదే పైచేయి అయ్యేది. కాలక్రమంలో దుష్ట తోడేలు తోక ముడిచి తప్పుకుంది. ఇప్పుడున్నదంతా ఒకటే తోడేలు. అదే ప్రేమ...సత్యం...ప్రశాంతత " అని చెప్పారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి