చత్రపతి శివాజీ మహారాజు గొప్ప పరిపాలనాదక్షుడే కాకుండా మతసామరస్యాన్ని పాటిస్తూ ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఊ షన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అన్నారు. బుధవారం పాఠశాలలో ఊషన్నపల్లికి చెందిన ఛత్రపతి శివాజీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి, కొబ్బరికాయలు కొట్టి, శివాజీ మహారాజ్ కి జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ శివాజీ మహారాజు అన్ని మతాలను సమానంగా చూసేవాడని, గుళ్ళు, గోపురాలే కాకుండా మసీదులను కట్టించాడని, తన సైన్యంలో ముస్లిములను చేర్చుకున్నాడన్నారు. శివాజీ మహారాజు గొప్ప వీరుడని, మొగలులు, సుల్తానులను తరిమి వేశాడన్నారు. తాను చేస్తున్న పని పట్ల అంకితభావం కలిగి ఉండేవాడని, ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడన్నారు. అనంతరం పాఠశాల పిల్లలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కమిటీ సభ్యులు పెళ్లి రాజేందర్రెడ్డి, కూసరాజు రెడ్డి, ధరణి మణికంఠాచారి, ముసుకు శివరామకృష్ణ రెడ్డి, ముసుకు సంపత్ రెడ్డి, ఆవుల సాయిరెడ్డి, కొనుకటి గణేష్ రెడ్డి, పొన్నాల సంతోష్ రెడ్డి, కొనుకటి శ్రీవాణి, పిటిఎస్ పి.లింగయ్య, పిల్లలు, పలువురు పాల్గొన్నారు.
మతసామరస్యాన్ని పాటించిన మహారాజు శివాజీ:--రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఈర్ల సమ్మయ్య

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి