వంశీ పొట్టిగా మరియు నల్లగా ఉంటాడు. చిన్నప్పటి నుంచి అతని రూపాన్ని వేలెత్తి చూపి, హేళన చేసేవాళ్ళు కొంత మంది ఉన్నారు. శ్రీహరి వాటిని పట్టించుకోలేదు. వాటి గురించి ఆలోచించలేదు. బాధపడలేదు. వంశీ చదువులో చురుకయిన వాడు. మంచి ప్రవర్తనతో స్నేహితులను కూడా సంపాదించాడు.
వంశీ స్నేహితులలో శ్రీహరి అనే స్నేహితుడు ఒకసారి అడిగాడు. "నిన్ను ఎంతో మంది మూర్ఖులు హేళన చేస్తూ ఉంటే ఊరుకుంటున్నావు ఎందుకు? వారికి బుధ్ధి చెప్పే ధైర్యం నీకు లేదా? ఉపాధ్యాయులకు చెప్పవచ్చు కదా?" అన్నాడు. "బజార్లో నిన్ను చూసి, పిచ్చి కుక్కలు మొరుగుతుంటే ఏమి చేస్తావు. తిరిగి వాటి మీద రాయి వేసి కొడతావా? బాబోయ్! అవి కరిస్తే పరిస్థితి ఏమిటి? వాటి వైపు చూడకుండా, వాటిని పట్టించుకోక పోతే అవి మనల్ని ఏమీ చేయలేవు. నన్ను హేళన చేసేవాళ్ళు కూడా పిచ్చి కుక్కలు అనుకొని మనసులో నవ్వుకుంటూ వాళ్ళను వదిలేస్తా." అన్నాడు వంశీ.
ఒకరోజు తెలుగు ఉపాధ్యాయుడు "ఏనుగు బోవజూచి ధ్వనులెత్తుచు కుక్కలు కూయసాగుచో " పద్యం చెప్పి దాని భావం చాలా బాగా చెప్పాడు. ఆ తర్వాత శ్రీహరి లేచి, "నిజం గురువు గారూ! మన పాఠశాలలో కూడా కొన్ని పిచ్చి కుక్కలు మంచి ప్రవర్తన కలిగి, చదువులో తెలివి గల వారిని వారు పొట్టిగా ఉన్నారని, వారు నల్లగా ఉన్నారని హేళన చేస్తున్నారు. అతడు వారిని పిచ్చి కుక్కల్లా భావిస్తూ మనసులో నవ్వుకుంటున్నాడు అనుకుంటా. ఆ కుక్కల్ని పట్టించుకోక వెళ్ళి పోతున్నాడు. అయినా తోటి విద్యార్థి చదువుకు, మంచి ప్రవర్తనకు విలువ ఇవ్వని వారిని ఇంకా నీచంగా ఎమనాలో తెలియడం లేదు." అన్నాడు. ఆ దుర్మా ర్గులైన విద్యార్థులు సిగ్గుతో తల దించుకున్నాడు. మళ్ళీ వంశీ జోలికి పోలేదు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి