విక్రమోర్వశీయం! :- .అచ్యు తుని రాజ్యశ్రీ

 మహాకవి కాళిదాసు ఋగ్వేదంలోని ఒక కథను తీసుకొని ఈ నాటకాన్ని రాశాడు ఇది పురూరవుడు ఊర్వశుల ప్రేమ కథ. రాజు హేమకూట పర్వతంపై ప్రకృతిని తిలకిస్తున్నాడు కొంతమంది స్త్రీల ఆర్తనా నాదాలు వినపడ్డాయి కేసి అనే రాక్షసుడు ఊర్వశిని ఎత్తుకు పోతున్నాడు ఆమె చెలికత్తెలందరూ సహాయానికి అరుస్తారు రాజు వెళ్లి ఆమెను కాపాడుతాడు ఆమె ఇంద్ర సభకి వెళ్ళిపోతుంది ఒకరోజు పురోరౌడు తన విదోషకునితో లతామంటపంలో కూర్చుని ఊర్వశిని గురించి మాట్లాడుతాడు చిత్రలేఖ తో కలిసి వచ్చిన ఊర్వసి ఆ మాటలు వింటుంది ఒక భోజ పత్రంపై శ్లోకాన్ని రాసి రాజు పైకి విసురుతుంది దాన్ని చదివిన అతను విదోషకుని చేతిలో పెడతాడు ఇది మహారాణి కౌశీనరీ చేతిలో పడుతుంది ఆమె కోపానికి రాజు భయపడతాడు స్వర్గంలో ఇంద్ర సభలో లక్ష్మీ స్వయంవరం అనే నాటకంలో ఊర్వసి నాయకగా అభినయిస్తోంది పురుషోత్తమా అనే బదులు పురూరవా అని సంభోధిస్తుంది ఆ నాటకాన్ని రాసిన భరత ముని కి కోపం వచ్చి ఊర్వశిని స్వర్గంలో ఉండటానికి తగవు అని శపిస్తాడు ఆమె రాజుతో ఉండవచ్చని ఇంద్రుడు అనుమతిస్తాడు రాజు గనుక ఆమెకు పుట్టిన కొడుకుని చూస్తే తిరిగి ఊర్వసి శాప విముక్తురాలు అవుతుంది అని అభయం ఇస్తాడు ఇలా వారు విహరిస్తుండగా ఒకచోట ఊర్వసి తీగలాగా మారి మాయమైపోతుంది పురోరౌడు బాధపడుతూ ఏడుస్తుంటే ఆకాశవాణి ఇలా సలహా ఇస్తుంది నీవు సంగమనీయ అనే మణిని తీసుకుని రా అప్పుడు నీకు ఊర్వసి దక్కుతుంది రాజు దాన్ని తీసుకొస్తుండగా ఒక గద్ద మణిని ఎత్తుకుపోతుంది బాణం దెబ్బకి గద్ద చనిపోతుంది ఆ బాణం పై. కొన్ని అక్షరాలు ఉంటాయి రాకుమారుడు ఆయు వదిలిన బాణం అని రాదు తెలుసుకుంటాడు చ్యవన  మహర్షి ఆశ్రమంలో ఊర్వసి ఆయు అనే కొడుకుని  ప్రసవించిందని రాజుకి తెలుస్తుంది పురూరవుని వియోగం సహించలేక  ఊర్వశి ఏడుస్తుంటే నారదుడు వచ్చి శాశ్వతంగా ఆమె అతనితో ఉండొచ్చని చెప్పడంతో నాటకం సమాప్తం అవుతుంది.భరతవాక్యంగా కాళిదాసు రాసిన శ్లోకం ఇది" లక్ష్మీ సరస్వతులు దూరదూరంగా ఉంటారు.కాన్వాసు విద్వాంసులు పండితుల కడ కలిసే ఉంటారు" అని అర్థం🌹
కామెంట్‌లు