రసగుళికలు; కె. ఎల్వీ . ప్రసాద్

 ర.గు.....5
నీ అదృష్టం అటకెక్కించి 
పచ్చని యవ్వనాన్ని అతడు 
ఎడారిపాలుచేసి పోయాడు !
దిక్కులేనిస్థితిలో నీనీలిచూపులు !!
-----------------------------------------------(30)
అప్పుడు నీమనసు వయసు  
అతడిచేతిలో దిగ్భందం !
పొంగిపొర్లిన నీయవ్వనం ,
అడవికాచిన వెన్నెల అయింది !!
-----------------------------------------------(31)
అదుపుచేసుకోలేని శారీరిక వత్తిడి 
నిన్ను నలుదిశల తిప్పింది ....!
నీస్వార్ధంలో మునిగి ....
ఆశావాహులొక్కొక్కరు కళ్లుతేలేసారు !!
-----------------------------------------------(32)
స్వార్ధంలో నిత్యం నువ్వేగెలుస్తుంటావు 
నీఅవసరం అవతలివారికి ఆకర్షణ !
నీ అవసరాలు తీరాక ....
అభిమానాలకు చెల్లుచీటీ .....!!
-----------------------------------------------(33)
నువ్వేమిటోతేలిసి కూడా....
నీ వైపే మొగ్గుతుంది నామనసు ...!
నీమాటల పనసతొనల రుచితో 
విస్కీ తాగినంత మత్తులో పడిపోతుంటాను !!
---------------------------------------------------------(34)
హంగులు -ఆర్భాటాలు నాకు నచ్చవు 
నా సాదారణ ఆహార్యం నీకునచ్చదు!
అదుగో అక్కడే నీదగ్గర నాకు
మైనస్ మార్కులు.......!!
--------------------------------------------------(35)
కామెంట్‌లు