తిక్క శంకరయ్య:- -డా . రూప
అడవులలో ఆవాసం 
పశువులతో సావాసం 
పాములతో చెలగాటం 
బూడిదలో మునకాటం

చలిలోనే సంచారం 
భూతాలే పరివారం 
పట్టదులే సంసారం 
భిక్షాటనే ఆహారం

తలపైనే జలపాతం 
మొలదాక జులపాలు 
సిగలోనే శశిచాపం 
ముఖమేమో వికారం

ఎదకేమో పులి చర్మం 
కటికేమో కరి చర్మం 
తనువేమో సగభాగం 
మనసేమో పరధ్యానం

కంఠంలో పాషాణం 
పిడికిలలో త్రిశూలం 
అరచేత ఢమరుకం 
అస్తికలే మెడహారం

కోపిస్తే తాండవం
ప్రేమొస్తే లాస్యం 
ఏలేది కైలాసం 
ఇచ్చేది కైవల్యం.


                         

కామెంట్‌లు