బండలు కొట్టేవాడైన
రిక్షాతొక్కే వాడైన
పాకులాడేది-జానెడు -
పొట్ట నింపుకొనేందుకే !
అవసరం మించి -
ఆస్తులు కూడబెట్టడం,
తినేవారి ముందటి పళ్ళాన్ని
లాక్కోవడం ...
శిక్షా స్మృతిలో లేని
భయంకర నేరం- .....!
చేత నిండా డబ్బులుంటే
ఆకలి తీరుతుందా?
ఇంటి నిండా సుఖాలుంటే
నిద్ర పడుతుందా?
చావుకు మొందే తెలుస్తుంది
ప్రాణ భయం!
ఉద్యోగాలు లేక నిరుద్యోగులు
ఆకలితొఅలమటిస్తుంటే
మరికొందరు
రెండు, మూడు ఉద్యోగాలతో
రాత్రి పగలు కంప్యూటర్లతో
కుస్తీ పడుతుంటారు!
సమానత్వమని మైకుల్లో -
అదరకొట్టే మహనీయులు
చేతులకు సంకెళ్ళు వేసుకుంటారు!
పకృతి కూడా సమానత్వాన్ని
మరిచిపోతూ ఉంటుంది!
అందుకే మరి--
వరదలు లేకుంటే కరువులు!!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి