అనంతపురం జిల్లా, గుత్తి మండలంలోని సేవాగడ్ లో జనవరి 26, 2025 - "శ్రీ సేవాలాల్ సద్భావన యాత్ర" యొక్క శుభ సందర్భంలో, సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ వారి తొలి ఆంగ్ల జీవిత చరిత్ర "సేవాగడ్ టు పోహరాగడ్" పుస్తకాన్నిసంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కొర్రా జగన్నాథరావు గారు సేవాగడ్ బంజారా భవన్ లో ఆవిష్కరించారు.
భారతీయ రైల్వేల విశ్రాంత ఇంజనీర్ శ్రీ ఎ.ఎస్.ఎన్. మూర్తి, ఐఆర్ఎస్ఎస్ఈ (రిటైర్డ్) రచించిన ఈ గ్రంథం, సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ వారి జీవిత మరియు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆంగ్ల భాషలో అందించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా బంజారా సమాజానికి అందుబాటులోకి తెచ్చింది. బంజారా సమాజ సేవలో అంకితభావంతో పనిచేసే శ్రీ ఎ.ఎస్.ఎన్. మూర్తి గారు, భగవద్గీతను సమాజంలోకి ప్రాచుర్యం చేయడానికి "గోర్ బంజారా భగవద్గీత సంగీత రూపకం" ను స్వధనము తో నిర్మించి, దానిని ఉచితంగా మొబైల్ ఫోన్ల ద్వారా అందిస్తున్నారు.
ఈ చారిత్రాత్మక ప్రచురణ బంజారా సమాజానికి ఒక అమూల్యమైన కానుకగా నిలుస్తుంది. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ వారి ఆధ్యాత్మిక వారసత్వంపై అవగాహనను పెంపొందించడంలో భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా సమాజ ఐక్యతను ప్రోత్సహించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఛారిటబుల్ ట్రస్ట్ యొక్క సీనియర్ అధికారులు - శ్రీ పి.ఎల్. రవీంద్ర నాయక్ (ఎస్పీ, రిటైర్డ్), వర్కింగ్ ప్రెసిడెంట్; శ్రీ ఎస్.కె. కేశవ నాయక్, వైస్ ప్రెసిడెంట్; శ్రీ సి. అశ్వర్థ నాయక్, జనరల్ సెక్రటరీ; మరియు శ్రీ ఎస్.సి. బాల నాయక్, ట్రెజరర్ - ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ట్రస్టీలు మరియు సభ్యులు - శ్రీ పి. రంగ నాయక్, శ్రీ ఠాగూర్ నాయక్, శ్రీ ఎస్.కె. రామచంద్ర నాయక్, ప్రొఫెసర్ సి.ఎన్. కృష్ణ నాయక్, శ్రీ ఎస్.ఎన్. కృష్ణ నాయక్ , శేఖర్ నాయక్ మరియు శ్రీ రాజేంద్ర ప్రసాద్ నాయక్ ప్రభృతులు ఈ వేడుకలో పాల్గొన్నారు. శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఎమ్మెల్యే; ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ముఖ్యులు - శ్రీ బాలాజీ నాయక్, జిల్లా అధ్యక్షుడు; శ్రీ పి. బాబు నాయక్, సెక్రటరీ; మరియు శ్రీ చక్రి నాయక్, ఎస్పీ, రాష్ట్ర జనరల్ సెక్రటరీ - ఈ కార్యక్రమానికి విచ్చేసి, దానికి మరింత వన్నె తెచ్చారు. బంజారా ప్రముఖులు శ్రీ హరిశౌరి నాయక్ (ఐటిఓ, రిటైర్డ్), డాక్టర్ శ్రీరామ్ నాయక్, శ్రీ పి. కిరణ్ నాయక్ (ఐటిఓ), డాక్టర్ రామస్వామి నాయక్ ,శ్రీమతి చంద్రి బాయి మరియు శ్రీ సేవాలాల్ సద్భావన యాత్రకు హాజరైన అనేక మంది ఈ వేడుకలో పాల్గొన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి