అమ్మ ఆకాశం!!:- డా. ప్రతాప్ కౌటిళ్యా
మనిషి 

పుట్టుకతోనే నెగిటివిటీ సమాజంలో పుడతాడు.!!

మనిషి 
మనసు మొదట నెగిటివిటీకే అట్రాక్ట్ అవుతుంది. 

మనిషి 
పగ ద్వేషం ఈర్ష్య అసూయ కోపం దురాశలో పుడతాడు.!!

మనం ప్రేమను కనిపెట్టాలి 
ప్రేమను ఎన్నుకోవాలి!!!!!

మనిషి 
దుఃఖం బాధ నిరాశ నిస్సహాయత లో పుడతాడు. 

మనం సంతోషాన్ని కనిపెట్టాలి 
సంతోషాన్ని ఎన్నుకోవాలి.!!!

***-***-**-*"

శక్తిని స్పృశిస్తే 
రక్త మాంసాల సప్త సముద్రాలు ఉప్పొంగినవి.!!

శూన్యాన్ని ముద్దాడితే 
మెదడులో కోట్ల నక్షత్రాలు చిట్లిపోయినవీ!!

పాదాలను కళ్ళకు అద్దుకుంటే
భూమ్యాకాశాలు  దద్దరిల్లినవి!!

గాలినీ  కౌగిలించుకుంటే
ఉచ్వస నిచ్వాసాలు ఆగిపోయినవీ!!

అమ్మ ఆకాశం కానీ రెక్కలు లేని పక్షిని 
నేను 
భూమి భుజాలపై వాలితే 
డాడీలా డేగ ఒకటి అవకాశం 
నన్ను ఓడిపోనివ్వలేదు. 
++++++++++++±+++++++++++++++
శ్రీశైలం-సుజాతల పెళ్లిరోజు శుభాకాంక్షలతో.
++++++++++++++++++++++++++++
డా ప్రతాప్ కౌటిళ్యా 👏
కామెంట్‌లు