సాహిత్య మహా సభలకు సోమన్నకు ఆహ్వానం

 రచయితల సంఘం వైఎస్సార్(కడప)జిల్లా శాఖ ఆధ్వర్యంలో శంకరాపురం,ఐ.యం.ఎ  హాల్ లో ఈ నెల 8,9 తేదీల్లో జరిగే రెండో  సాహిత్య,సాంస్కృతిక  మహాసభలకు కర్నూలు జిల్లా, పెద్దకడబూర్ మండలం,కంబదహాళ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడు గా పనిచేస్తున్న  ప్రముఖ బాలసాహిత్యవేత్త,బాలబంధు గద్వాల సోమన్నకు ఆహ్వానం అందింది.రచయితల సంఘం వైఎస్సార్(కడప)జిల్లా శాఖ అధ్యక్ష,కార్యదర్శులు ఆచార్య  మూల మల్లికార్జునరెడ్డి,జింక సుబ్రహ్మణ్యం లు ఆహ్వాన పత్రం పంపినట్లు ఆయన తెలిపారు.అదీ కాక కవి సోమన్న 63వ పుస్తకం 'హృదయ రాగాలు' ముఖ్య అతిథి,అవనిగడ్డ శాసన సభ్యులు డా.మండలి బుద్ధ ప్రసాద్ గారి చేతుల మీద అవిష్కరిస్తున్నట్లు,'రాయలు ఏలిన రాయలసీమ' అంశం పై కవితగానం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కామెంట్‌లు