అంతర్జాల పాటల కార్యక్రమం బుధవారం దిగ్విజయంగా ముగిసింది.ప్రముఖ గాయని హజార ఆమని ముఖ్య అతిథిగావిచ్చేసి పాట ప్రాముఖ్యం, పాట పాడే విధానంలో మెలుకువలు వివరించి అనేక సినీ పాటలు పాడి వినిపించారు.
ప్రముఖసాహిత్యవేత్తలు సంస్థలఅధినేతలు డా.రామకృష్ణ చంద్రమౌళిగారు, డా.V. D. రాజగోపాల్ గారు, ఘంటామనోహర్ రెడ్డి గారు, డా. కృష్ణారెడ్డి గారు,డా. రాధాకుసుమ గారు ఆత్మీయ అతిథులుగా పాల్గొని జనజీవనంలో పాట ప్రాముఖ్యం, ఒకపాటవ్యక్తిలో ఎలాంటి స్ఫూర్తినికలిగించి ఆనందం,ఆరోగ్యాన్ని ఏవిధంగా అందచేస్తుంది,అనివివరిస్తూ, గాయని,గాయకులకుపాట పాడే విధానంలోసలహాలు అందచేశారు.వారు కూడా తమస్వరాలతో తీయనిగానామృతం చేసారు.
ఈకార్యక్రమం లో పెద్దలు అందచేసిన విషయాలన్నిటిని తప్పక గ్రహించి చక్కని గాయని గాయకులుగా తీర్చిదిద్దుకుంటామని పాల్గొన ప్రతి గాయని గాయకులు సంతోషం వ్యక్త పరిచారు.
అందరూ చక్కని పాటలు రెండు రౌండ్స్ కూడా పాడి సభికులను, ప్రేక్షకులనుఆనంద పరిచారు. ఎంతో సరదాగా, క్రమశిక్షణగా,
నిర్వీరామంగా 5 గంటల పాటు జరిగిన ఈ పాటల కార్యక్రమాన్ని c. నారాయణ స్వామి గారు, B. శ్రీమన్నారాయణ గారు చక్కగా నిర్వహించారు.
అందరూ చక్కగా పాల్గొనిపాటల కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు సమూహ అధ్యక్షురాలుడా.అరుణ కోదాటి ( అక్కిరాజు ) అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియచేసారు.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అరుణ గారికి అభినందనలు 💐
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి