నిఖిల జగతి నీ కోసం
నిండు మనసుతో
నీరాజనం పడుతూ
నిన్నే స్వాగతిస్తోంది ప్రభూ...
నీలినింగి నిలిచి చూస్తూ
పాలమబ్బుల వీవనలతో
వింజామరలు వీస్తూ
నీ సేవలో తరిస్తోంది స్వామీ!
నీటిలోని అలలతో
సయ్యాటలాడుతూ
చిన్ని మీనాలు నిన్ను చూడగా
తుళ్లిపడుతున్నాయి తండ్రీ!
రేకులిప్పని మొగ్గ బాలలను
మందలించి మేలుకొలుపుతూ
నీ దర్శనం చేసుకోమని
తల్లి తీగ తొందర పెడుతోంది దేవా!
తూరుపు వాకిట వేలాడుతూ
తోరణంలా పచ్చనాకులు
శుభకరంగా శోభ స్కరంగా
ద్వారాన వేచి ఉన్నాయి దయామయా!
మా కన్నుల వెలుగు నింపి
మా బ్రతుకులు దశ తిరిగేలా
మా నడవడి ధర్మ మార్గాన
నడిపించే నభోమణీ... 🙏
నీ రాక మాకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి