శ్లోకం:
అర్థమనర్ధం భావయ నిత్యం
నాస్తి తతః సుఖ, లేశః సత్యం!!
పుత్రాదపి ధన భాజాం భీతిః
సర్వత్రైషా విహితా రీతిః !!
భావం : ధనము, అనర్థము కలుగజేయు ననియూ, ఆధ్యాత్మిక ప్రయోజనం లేని దనియూ.
ఎల్లప్పుడూ భావించుము. ఆ ధనము వలన కొంచమైనను పారమార్థిక సుఖము లేదు. ఈ విషయము ముమ్మాటికీని సత్యము. ధనవంతులకు తమ పుత్రుల వల్ల కూడా భయము కలుగుచుండును. ఈ పద్ధతి లోకమందు అంతటనూ ఒకే విధంగా ఉన్నది.
*****
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి