కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు ఉపాధ్యాయులు ఆదివారం విజ్ఞాన విహారయాత్రకు వెళ్లారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దేవాలయం, రామప్ప చెరువు, లక్నవరం, మేడారం ప్రాంతాలను సందర్శించారు. వాటి ప్రాముఖ్యతను తెలుసుకొని అక్కడి సుందర దృశ్యాలను వీక్షించారు. రామప్ప చెరువులో బోటింగ్ చేశారు. రామప్ప దేవాలయంలోని రాతి శిల్పాలను, రాతితో తయారు చేసిన నంది విగ్రహాన్ని పరిశీలించారు. లక్నవరం లోని 13 ద్వీపాలను వీక్షించారు. అక్కడి ప్రకృతి రమనీయతకు మంత్ర ముగ్ధులయ్యారు. వేలాడుతున్న వంతెనపై నడుస్తూ వారు ఆనందంతో ఉప్పొంగిపోయారు. అనంతరం మేడారం ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. పాఠ్యాంశాలను పాఠ్య పుస్తకాల్లో చదివిన పిల్లలు ఈ ప్రాంతాలను ప్రత్యక్షంగా చూడడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ విజ్ఞాన, విహార యాత్రలు పిల్లల మానసిక వికాసానికి ఎంతో దోహదం చేస్తాయన్నారు. దీనివల్ల పిల్లలకు ప్రత్యక్ష అనుభవం కలిగి, వారు నేర్చుకున్న విషయాలు దీర్ఘకాలంగా ఉండిపోతాయని ఆయన అన్నాను కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయుడు అమృత సురేష్ కుమార్, కొంకటి శ్రీవాణి, బండారి స్రవంతి, విద్యార్థినీ, విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రులు, పలువురు పాల్గొన్నారు.
విజ్ఞాన యాత్రలో ఊషన్నపల్లి విద్యార్థులు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి