వాసవి అసోసియేషన్,పుస్తక మిత్ర పంపించిన పుస్తకాల ప్రదర్శన
 ,తెలంగాణ ఆదర్శ పాఠశాల,లింగాల ఘణపురం మండలం, జనగామ జిల్లాలో గురువారం ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్,పుస్తక మిత్ర వారు పంపించిన అమూల్యమైన పుస్తకాల ప్రదర్శన ,  గ్రంథాలయం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి శ్రీ పి.విష్ణుమూర్తి గారు హాజరై పుస్తక పఠనం యొక్క ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు.పాఠశాల ప్రధానాచార్యులు శ్రీమతి జి.సునీత గారు,పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొని పుస్తకం  విలువను,పుస్తక పఠనం ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేశారు.ఈ సందర్భంగా మండల గారు విద్యాశాఖ అధికారి ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ వారిని అభినందించారు.పేద విద్యార్థులకు పుస్తకాలు అందుబాటులో ఉంచడం కోసం ప్రారంభించిన ఈ కార్యక్రమం చాలా ప్రశంసనీయమైనది.


కామెంట్‌లు