ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యుటిఎఫ్ మిత్ర సంఘాలు బలపరిచిన పిడిఎఫ్ అభ్యర్థినైన తనను, మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని కోరెడ్ల విజయగౌరి ఓటర్లను కోరారు. తనను గెలిపించి పెద్దలసభకు పంపిస్తే ఉత్తరాంధ్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపకుల గొంతుకనై ప్రశ్నిస్తానని సమస్యల పరిష్కారదిశగా తన అడుగులు ఉంటాయని అన్నారు.
భామిని మండలంలో బాలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, భామిని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పర్యటించి ఉపాధ్యాయులతో, అధ్యాపకులతో మాట్లాడారు.
ఉపాధ్యాయుల, గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల, కాంట్రాక్టు లెక్చరర్ల, కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తానని, వారి ఉద్యోగ భద్రతకు మరియు మినిమం టైం స్కేల్ సాధనకు కృషి చేస్తానని తెలిపారు.
అనంతరం కొత్తూరులో ముఖ్య కార్యకర్తలతో ముఖాముఖి సమావేశం నిర్వహించి, పలు విషయాలు ముచ్చటించారు.
విజయగౌరి పర్యటనలో ఆమె వెంట పార్వతీపురం మన్యం జిల్లా యుటీఏఫ్ గౌరవాధ్యక్షులు ఆరికి భాస్కరరావు, యుటీఏఫ్ రాష్ట్ర కౌన్సిలర్ దండు ప్రకాశరావు, జిల్లా కార్యదర్శి కుండంగి కృష్ణారావు, భామిని మండల అధ్యక్షులు ఈగల తిరుపతిరావు, జిల్లా కౌన్సిలర్లు పి.కృష్ణారావు, సీతంపేట మండల ప్రధాన కార్యదర్శి బి.ఆనందరావు, మహిళా నాయకులు టి.రాజుకుమారి, విశాలాక్షి, సిఐటియు నాయకులు సిర్ల ప్రసాద్, యుటిఎఫ్ శ్రీకాకుళం జిల్లా కౌన్సిలర్లు కుదమ తిరుమలరావు, తూతిక సురేష్ తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి