అబాబీలు- ఎం. వి.ఉమాదేవి

 ప్రక్రియ  - కవి కరీముల్లా గారు 

21)
ఇంట్లో వాళ్ళే కావచ్చు
పదే పదే తిట్టకూడదు!
బంధాలు తెగి పోతాయి,
      ఉమాదేవీ !
 విమర్శలు క్రుంగదీస్తాయి!
22)
కోపిష్టి వాడికి పశ్చాత్తాపం ఉండదు.
అహాన్ని వదిలేయని వాడు 
మానవత్వం చూపించలేడు 
    ఉమాదేవీ  !
క్రోధమున్న  మనిషి సదా ఒంటరే!
కామెంట్‌లు