సుప్రభాత కవిత : -బృంద
వెలుగుల తడిసిన 
జిలుగుల సొగసులు 
కన్నుల విందుగ విరిసిన 
వన్నెచిన్నెల సుమ సోయగం 

పలవరించు  పుష్పాల
పలకరించు  కాంతిరేఖలు 
చిలకరించు మకరందాల 
పరిమళించు  మధువనం!

అడుగుకో అందం 
అణువణువూ ఆనందం 
ఆస్వాదించు  మనసుంటే 
అనుభూతుల మణిహారం!

మందిరంలో దర్శనంలా 
మనసుకు శాంతినిచ్చి 
మది దోచే సుకుమారాల 
కుసుమ విలాసం!

ప్రసాదంలా పంచే సంతోషం 
ప్రమోదమిచ్చే అనుభవం 
ప్రకాశించే జగతికదే 
ప్రభాకరుడి అనుగ్రహం

అనన్య కారుణ్య సింధువు 
ఆత్మీయ ఆప్త బంధువు 
అద్భుత వరాలు అందించు 
అప్రమేయ అనుగ్రహ కాంతులకు 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు