మనం రకరకాల స్వీట్స్ హాట్స్ తింటాం.కానీ కొన్ని వంటకాలు విదేశాలనుంచి దిగుమతి ఐనాయి.పావ్ భాజీ అనే వంటకం లో పావ్ అనేది పోర్చుగీస్ భాషాపదం. వారు రకరకాల కూరలు మెత్తగా వండి కారం మసాలా కల్పి తింటారు.మనంఉల్లిపాయ వెల్లుల్లి మసాలా కల్పి పావ్ భాజీ అంటున్నాం. గులాబ్ జామూన్ అనగానే నోరూరుతుంది కదూ?పర్షియన్ వంటవాళ్లు మొగల్ పాదుషాలకోసం చేసిన స్వీట్.దాని అసలుపేరు లుకమా తె అల్ కదీ! ఇక సమోసా మధ్య ఆసియా వంటకం.అక్కడ మాంసంతో వండితే మనం ఆలుగడ్డ మసాలా దట్టించి లొట్టలేస్తాం.రాజ్మా బియ్యం మెక్సికో లో పంట. పోర్చుగీస్ వారి ద్వారా హర్యానా పంజాబ్ లో సాగులోకి తేబడింది. హల్వా అంటే ఇష్టపడని వారెవ్వరు చెప్పండి?పర్షియన్ హలవ్ నుంచి హల్వా వహ్వా అంటూ మనవద్దకు చేరింది.తీపి అని అర్థం.జలేబీ అదే జిలేబి అసలు పేరు జులాబ్. ఇరాన్ నించి దిగుమతైంది. కెడలీ అనే వంటకం ఇండోనీషియాది. అదే మనం తినే ఇడ్లీ అంటే నమ్మబుద్ధికాదు కదూ!?మనం ఆలుగడ్డల్ని ఉడికించి తింటాం చెక్కు కూడా తీసేస్తాం కానీ దాని చెక్కు తోటి అంటే తొక్క పడేస్తాం కానీ దానితో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి స్టైలిష్ స్టీలు స్టైన్లెస్ స్టీలు చెంచాలు మొదలైన వాటిని ఆలుగడ్డ తొక్కతో తోమితే అవి బాగా మెరుస్తాయి ఆపై నీటితో కడిగి బట్టతోటి శుభ్రంగా తుడవాలి అట్లాగే గాజు సామాన్లు కిటికీ అద్దాలు ఆలుగడ్డ చెక్కు తోటి శుభ్రంగా తుడుస్తే మెరుస్తాయి చెప్పులు కాలు బూట్లు ఈ ఆలుగడ్డ తొక్కతో రుద్దితే బాగా షైనింగ్ వస్తుంది మురికి పోతుంది అలాగే వంటింటి సింకు టైల్స్ జిడ్డు మరకలు పోవాలంటే వీటితో బాగా రుద్ది ఆపైన బ్రష్ తో నీరు పోసి కడగాలి మనం అన్నం తినే టేబులు ఇంకా కర్ర కుర్చీలు టేబుల్స్ పై మరకలు ఉంటే బాగా ఆలుగడ్డ చిక్కు తోటి రుద్దితే కాసేపు అలా గాలికి వదిలి తడి బట్టతో తుడిస్తే శుభ్రపడతాయి ఇలా ఆలుగడ్డలు ఉడికించినాక ఆ పై తొక్కల్ని చెట్లకు వేస్తే మంచి పోషకాహారం లభిస్తుంది ఆలుగడ్డ ఉడికిన నీటితో మొహం కాళ్లు చేతులు మనం కడుక్కుంటే మెలమెలా మెరుస్తుంది చర్మం
ఇక మనం పార్క్ రోడ్డుపక్కన పొడవుగా పెరిగే అశోక చెట్లని చూస్తాం ఈ చెట్ల వ వలన ఎంతో లాభం ఉంది దీని ఆకులు బెరడు మందు రకరకాల వ్యాధులకు పని చేస్తాయి దీని ఆకులతో కషాయం కాచి తాగితే స్త్రీలకు ఉన్నటువంటి కడుపు నొప్పి సమస్యలు పోతాయి అజీర్ణం పొట్టలో పురుగులు పోతాయి కీళ్ల నొప్పులు ఉంటే ఈ కషాయం తగ్గిస్తుంది దీని ఆకుల్ని బాగా మెత్తగా నూరి లవంగ నూనెతో కలిపి శరీరం జాయింట్ దగ్గర మాలిష్ చేస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి ఈ చర్మానికి కూడా చాలా మంచిది ఈ అశోకాకుల కషాయంతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు కురుపులు మొటిమలకు మంచిది బ్యాక్టీరియా నశిస్తుంది ముడతలు పడ్డ మొహానికి దీని ఆకులు మెత్తగా చేసి రుద్దితే ముడతలు మచ్చలు పోతాయి డాక్టర్ సలహా పై కషాయం తాగటం మంచిది🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి