ఉపపాండవుల వృత్తాంతం! సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 పాండవుల వల్ల  ద్రౌపదికి 5గురు కొడుకులు పుట్టారు.ధర్మరాజుకి ప్రతివింద్యుడు, భీముడుకి సుతసోముడు, అర్జునుడికి శ్రుతకర్ణుడు, నకులుడికి శతానీకుడు, సహదేవుడికి శ్రుతసేనుడు ద్రౌపతికి జన్మించారు.కురుక్షేత్రంలో వీరవిహారంచేసి ఆఖరిరోజు సౌప్తికంలో వధింపబడ్డారు. విశ్వే దేవతలుగా తమ లోకానికి వెళ్తారు.వీరిని గూర్చిన సమాచారం హరిశ్చంద్రుని కథలో కన్పడ్తుంది. విశ్వామిత్రుడు ఆరాజుని  బాకీ చెల్లించమని ఎలా పీక్కుతిని నక్షత్రకుని పంపిన కథ ప్రసిద్ధం.తింటానికి పండుకూడా దొరకకుండా చేసిన విశ్వామిత్రుని క్రూరత్వం ని  విశ్వేదేవతలు ఆక్షేపించిటంతో ఆయన కోపించి" మీరు భూలోకంలో పుడ్తారు.పెళ్లి పెటాకులు లేకుండ బతుకుతారు.దేవకార్యం పూర్తయినాక మీలోకానికి వెళ్తారు." అలా వారు ద్రౌపదికి పాండవులవల్ల పుట్టిన వారు ఉపపాండవులు🌹
కామెంట్‌లు