ప్రేమికుల దినం...! - * ప్రేమతత్వంమనోహరం *:- కోరాడ నరసింహా రావు!
 * ప్రేమ *  అదొక అనిర్వచ నీయానం దానుభూతి...! 
  ఒకరిలోని యేదో సమ్మోహన శక్తి ఇంకొకరిని ఆకర్షి0చింది...! 
  ఆదిరూపమో...చక్కనిమాటతీరో...కమ్మగాపాడేగాత్రమో... యేదో , మరేదో కట్టి పడే సింది...! 
     ఒకరిని వీడి మరొకరు ఉండలేనిస్థితి... 
     ఏ పని చేస్తున్నా ఆ తలపులే, ఆ ధ్యాసే..! 
      ఎప్పు డెప్పుడు తనను చూస్తానా, తన మాటలతో పుల కిస్తానా, తన నవ్వులతో ఈ ప్రపంచాన్ని మరచి ఆ మధుర ప్రపంచంలో విహరిస్తానా ఆ స్పర్శలో పులకించిపోతానా ... ఇదే ధ్యాస...! 
     ఒకరిసుఖం ఇంకొకరికి ఆనందం...ఒకరి బాధ మరొకరి విషాదం..!
    ఒకరి శ్రేయస్సుకై ఒకరు, 
యే కష్టానికైనా, నష్టానికై నావారు దేనికైనాసిద్దమే..! 
   ఇరువురి లోనూ.. ఒకరి కొరకుపరస్పరంత్యాగమే... స్వార్ధం కానరాదు! 

ఇది కదా నిజమైన ప్రేమ
 ఇదికదా స్వచ్ఛమైన ప్రేమ
 ఇదికదా నిర్మల,నిష్కల్మష ప్రేమ...! 

కామమే ప్రేమనుకుని ఎ దుటివ్యక్తిని ప్రేమించమని వేధించటం ప్రేమా...!? 
   నాకు దక్కనిది,వేరెవరికీ దక్క కూడదని హత్యలు చెయ్యటం ప్రేమా...?! 
  తనను కాదన్నది అందం గా, ఆనందంగా బ్రతక కూడదని ముఖం మీద యాసిడ్ పోయటం ప్రేమా...!??! 
   కామాన్ని, వ్యామోహాన్నీ ప్రేమ అనుకుని ప్రేమను అపవిత్రం చెయ్యకండి..! 
 ప్రేమను ప్రేమిం చండి... 
    ప్రేమను బ్రతిక నివ్వం డి.!! 
    ******

కామెంట్‌లు