అనుబంధాలకు ప్రతిరూపం అందమైన కుటుంబం

 విశాఖపట్నం ముడసర్లోవ పార్క్ లో అత్యంత వైభవంగా అందమైన కుటుంబం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మూడువందల మందికి పైగా బంధుగణం పాల్గొని తమ తమ ఆప్యాయతలను, అనురాగాలను పంచుకున్నారు. 
పార్వతీపురంమన్యం జిల్లా కుదమ గ్రామంలో జన్మించిన కుదమ గంగన్న బాబయ్య పట్నాయక్, సూర్యనారాయణ పట్నాయక్ లనే ఇద్దరు అన్నదమ్ములు ఏభై ఏళ్ళ క్రితం స్వర్గస్తులైరి. గంగన్న బాబయ్య పట్నాయక్ పిల్లలైన ఐదుగురు కొడుకులు, నలుగురు కూతుళ్ల కుటుంబాలతో పాటు, 
సూర్యనారాయణ పట్నాయక్ పిల్లలైన ఐదుగురు కొడుకులు, నలుగురు కూతుళ్ల కుటుంబాలకు చెందిన మొత్తం ఎనభై పైబడి కుటుంబాల సమ్మేళనంగా 
ఈ అందమైన కుటుంబం ఆవిర్భవించింది. 
వీరంతా ఒకరోజంతా ఆనందడోలికల్లో మునిగి తేలుతూ ఆహ్లాదంగా గడిపారు. 
రెండు సంవత్సరాల క్రితం మధురవాడ శిల్పారామంలో తొలి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోగా, 
వీరిలో ఒక కుటుంబసభ్యులైన ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్ విచ్చేసి, అందమైన కుటుంబంను ప్రారంభించి, లోగో ను ఆవిష్కరించారు. 
నేడు జరిగిన రెండో సమావేశాన్ని విశ్రాంత మండల విద్యాశాఖాధికారి కుదమ పరమేశ్వరరావు ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన కుదమ కృష్ణసాయి, కుదమ లత, కె.అరుణ, అరసాడ శాంతి, స్వర్ణసాయిసుధలు గావించగా, ప్రార్ధన, స్వాగతగీతాలతో ఈ ఆత్మీయ సమ్మేళనం ప్రారంభమైంది. అనంతరం
తమ తమ కుటుంబాలలో స్వర్గస్తులైన తమవారందరి అనుభవాలను, వారు అధిగమించిన కష్టాలను, చేసిన త్యాగాలను ప్రసంగిస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించడంతో సభ మొదలైంది. వేదికపై చిన్నారులు దుగ్గివలస గమని, శేఖరమహంతి మనీషా తదితరులు నృత్యాలు ప్రదర్శించగా అలివేలుశాంతి, రఘుపాత్రుని మానస, స్వర్ణసాయిసుధలు తమ గీతాలాపనలతో సభను అలరించారు. తెలుగు పద్యాలను వల్లించిన చిరంజీవి బలివాడ లిఖిత్ నారాయణ్,  
భగవద్గీత శ్లోకాలను వినిపించి ఆద్యాత్మిక వాతావరణం కల్పించిన చిరంజీవి కుదమ చరణ్ పట్నాయక్ లు అందరి ప్రశంసలు పొంది జ్ఞాపికలతో సత్కారం పొందారు.  
జి.కె.బిట్స్ క్విజ్ పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు జ్ఞాపికలను బహూకరించారు.
పదోతరగతి, ఇంటర్మీడియట్, ఆపై పెద్ద చదువుల్లో మిక్కిలి ర్యాంకులు సాధించిన ఎం.పి.భరత్ కుమార్, కుదమ భార్గవి, కె.సాయిచరణ్, నడుకూరు పూజ, దుగ్గివలస గమని తదితరులను అభినందిస్తూ శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. 
అందమైన కుటుంబంలో సభ్యులై బంధుగణమంతటికీ గర్వకారణంగా నిలిచిన
రాష్ట్రపతి పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు, ముఖ్యమంత్రులచే పురస్కారాలు పొందిన పక్కి మధుసూదనరావు, కుదమ పరమేశ్వరరావు, పదోన్నతిపై ఎంపిడిఓగా నియమితులైన అరసాడ రఘుపతిరావు, విజయనగరం జిల్లా జడ్జిగా సేవలనందిస్తున్న కంటిమహంతి విజయ కల్యాణి, 
జర్నలిజంలో మిక్కిలి కృషి చేస్తున్న రఘుపాతృని వెంకట పట్నాయక్, గొడబ నాని అబ్బాయి పట్నాయక్, కుదమ గోపి, ఒడిశాలోని ఆదర్శవంతమైన ఉద్యోగిగా ఖ్యాతి గాంచిన కుదమ సత్యసాయిబాబా లకు శాలువా జ్ఞాపికలతో ప్రత్యేక సత్కారాలు గావించారు.
ఈ మూడు వందల మందితో మరింత సత్సంబంధాలు పెంపొందించుకునే ఉద్దేశంతో 
భవిష్యత్తు కార్యక్రమాల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. 
అందమైన కుటుంబం అధ్యక్షునిగా కుదమ పరమేశ్వరరావు, 
ప్రధాన కార్యదర్శిగా కుదమ గోపి,
ఆర్గనైజింగ్ సెక్రటరీగా  కె.శ్రీనివాసరావు, 
కోశాధికారిగా అరసాడ రఘుపతిరావులను కుటుంబీకులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గౌరవసలహాదారులుగా కుదమ కృష్ణారావు, భాస్కరరావు, 
కె.అరంజ్యోతి, తుంబలి యజ్ఞేశ్వరరావు, బగ్గాం ధనంజయరావు
గౌరవాధ్యక్షులుగా ఆర్వీ పట్నాయక్, ఎస్.కె.గోవిందరావు, ఎం.పి.గౌరీశంకరరావు, 
మహిళా కార్యదర్శులుగా అలివేలు, లత, కృష్ణసాయి, విజయ, రాధ, శాంతి, సుకన్య, లక్ష్మి, భాషిణిలను ఎన్నుకున్నారు. 
కల్చరల్ కమిటీ కార్యదర్శులుగా కె.వెంకట చలపతిరావు, ఎ.హరనాథరావు, తిరుమలరావు, వి.స్వర్ణసాయిసుధ, పాల్తేరు మాధవరావు, కె.మధుసూదనరావు, సాలూరు రామకృష్ణలు ఎంపికైరి. 
ఉపాధ్యక్షులుగా తట్టికోట గణపతిరావు, ఎ.వాసుదేవరావు, కె.వి.చలపతిరావు, పక్కి మధుసూదనరావు, కె.నాగభూషణరావులు,
సహకార్యదర్శులుగా నడుకూరు విజయకుమార్, కె.మధుభాను కుమార్ పట్నాయక్, ఎన్.శ్రీనివాసరావు, కె.సంతోష్ కుమార్, 
ఆహ్వాన కమిటీ సభ్యులుగా  కె.సత్యసాయిబాబా, కె.రమేష్, మల్లేశ్వరరావు, పక్కి తులసీదాస్, కె.రవి, రేగులవలస రవి, ఎ.తిరుపతిరావు, కె.రామ్ ప్రసాద్,  
దేవీప్రసాద్ పట్నాయక్, పి.రామదాస్ లు ఎంపికైనారు.
ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ స్థిరపడిన వారంతా హైదరాబాద్, కొరాపుట్, తాల్చేర్, బెంగళూరు, చెన్నై వంటి సుదూర ప్రాంతాలనుండి కుటుంబాలతో సహా వచ్చి బంధువులందరితోనూ సంతోషంగా గడిపారు.
ఈ కుటుంబంలో ఒక సభ్యులైన ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పీపట్నాయక్ తాను హాజరుకాలేకపోతున్న విషయాన్ని చరవాణి ద్వారా సందేశాన్ని పంపించారు. అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అందమైన కుటుంబం అంతరాల్లో ప్రేమానురాగాలు నిండి యుండుట అభినందనీయమంటూ ఆర్పీ పంపిన సందేశాన్ని వేదికపై వినిపించారు.
కామెంట్‌లు