అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహాంలింకన్ కష్టాల కడలి ఈది అధ్యక్షునిగా ప్రపంచ జనుల జేజేలందుకున్న ప్రసిద్ధుడు.ఆయన ఎంత మంచి మాట చెప్పారంటే పనిచేయాలంటే సాధన పనిముట్లు కావాలి.గొడ్డలికి బాగా పదునుపెడ్తే కానీ ఒకచెట్టు నరకలేము. అందుకే"నేను 4గంటలు గొడ్డలికి పదును పెట్టి 2గంటలు చెట్టు నరుకుతా" అని అన్నాడాయన. పరీక్షలకు బాగా ప్రిపేరై ఓ3_4 పెన్నులు దగ్గర ఉంచుకోవాలి. ప్రతివిద్యార్థి ఇది గుర్తుంచుకోవాలి. మధ్యలో పెన్ను మోరాయిస్తే కష్టం.ఆహారం లేకుండ పరుగులు తీస్తే నీరసంతో టెన్షన్ తో రాయలేరు.
బిల్ గేట్స్ ఏడాదికి 50పుస్తకాలు చదువుతారు.ఎలన్ మస్క్ రోజూ 10గంటలు పుస్తక పఠనంతో గడుపుతారు.అందుకే బాల్యం లోనే పిల్లల కి పేపర్ పుస్తకం అలవాటు చేయాలి.పెద్దలు కూడా వారితో చదివినవి చర్చిస్తే గుర్తుంటాయి. బట్టీ పట్టకుండా ఆలోచించి ప్రశ్నించే పిల్లలకు మార్కులు రాంక్ రాకపోవచ్చు కానీ సృజనాత్మకతతో వారు రాణిస్తారు.
క్యాన్సర్ తో బాధపడే చిన్నారులకు చేయూత ఓదార్పు ఇచ్చే సంస్థ సెయింట్ జ్యూడ్ ఇండియా ఛైల్డ్ కేర్ సెంటర్.ఆపిల్లల అమ్మ నాన్నలకు ఊరట ఇచ్చే ఆసంస్థను ఆరంభించినవారు ముంబైకి చెందిన నిహాల్ శ్యామకవిరత్నే దంపతులు.నిహాల్ కాన్సర్ బాధిత పిల్లల అమ్మ నాన్నలకు వసతి భోజన ఏర్పాటుకై తనతల్లిపేరుతో ప్రారంభించారు.పిల్లలకు చదువు చెప్పేందుకు టీచర్ వస్తారు.వాళ్లకు పెయింటింగ్ బొమ్మలతయారీ లో తర్ఫీదిస్తారు.హైదరాబాద్ లో బసవతారకం నిమ్స్ రెయిన్ బో ,ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రుల్లో ఈసంస్థ తనవంతు పాత్ర పోషిస్తోంది🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి