మాతృభాష!!!:-డా ప్రతాప్ కౌటిళ్యా
భాషను కనిపెట్టింది పక్షి!!
గానాన్ని కనిపెట్టింది పక్షి!!!

మేధస్సుకు భాషాసాంకేతికత
పుట్టింది పక్షిలో!!?
భాషకు మాతృక పుట్టింది పక్షుల్లో
మాతృభాష పుట్టింది మనుషిలో!!!

స్వరాలు నేర్చుకుంటాం! 
అక్షరాలు రాసుకుంటాం!!

అమ్మకు పుట్టేది మనమే కాదు 
మాతృభాష కూడా!!

భాష ఒక జ్ఞాపకం అనువంశిక జ్ఞాపిక!!
అమ్మ ఒక సజీవ జ్ఞాపకం 
మాతృభాష ఒక జీవ భాష!!

భాష అంటే మాట!
మాటంటే పాట !!
పాటంటే పాఠం !!!
సర్వస్వం  ఒక స్వర పేటిక !
మాతృభాష ఒక వరం!!

మనసంటే సమాచారం !
జ్ఞానేంద్రియాలు అంటే జ్ఞానం !!
మాతృభాష అంటే 
మొదటి సమాచారం!!!!!

ఒక్క భాష వస్తేనే 
వంద భాషలు నేర్చుకుంటాం!!

ఒక్క భాషలోనే 
జన్మంతా కలలు కంటాం!!

కారణం వ్యాకరణం లేకుండానే 
మాతృభాషా నేర్చుకుంటాం!!?

=================================
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం పురస్కరించుకొని. 

డా ప్రతాప్ కౌటిళ్యా 👏.

కామెంట్‌లు