శుభోదయ క్రీడలు:- ---డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్.

 తెల్లారకముందే 
నిద్రలేస్తాడు .....!
అమ్మనూనాన్ననూ 
ఇబ్బందిపెట్టడు ...!
నిద్రాభంగము 
అసలుకలిగించడు !
పేచీపెట్టడు .......
పక్కనుండి దిగుతాడు 
హాలుకు చేరతాడు 
తనదయిన శైలిలో 
ఆటలు ఆడతాడు !
నేలపై పడి -
అటుఇటు దొర్లుతాడు !
ఆటవస్తువులతో ...
ఆడుతూ-పాడుతూ
మాట్లాడుతుంటాడు ,
పాటను ఊహించుకుని 
తెగ గంతులేస్తాడు !
మామంచి మనవడు,
మా ...నివిన్ బాబు !!
               ***
కామెంట్‌లు