నేను నీవైన వేళ!:- డా. సి వసుంధర,చెన్నై.- సెల్. 09790878439
కొంప ముంచితివి కంప్యూటరమ్మ.
నాబుర్ర  కాస్త నీ సొంతం
అయ్యే. అయ్యానమ్మో నేనొక యంత్రాన్ని నేడు.

నా
చిన్న మెదడు చితికి పోయింది
పెద్ద మెదడు పారి పోయింది
లెక్కలేసే చుక్కల ముగ్గులు 
పక్కగా  పెట్టేదాన్ని.
పట్టానమ్మా కంప్యూటర్నునిన్ను
పాడయింది నా బుర్ర మొత్తం. 

రెండు రెండ్ల ఎంత?అంటూ బామ్మ 
అడిగితే నీ మొహం చూడాల్సివచ్చింది
తల్లి.
పగలు రాత్రి పక్కన చేరి. మా చేతులకు పని చెప్పావు
నిద్ర భద్ర ఊడ్చుకపోయాయే
పిల్లా ,పాప
 ఇల్లు, వాకిలి అన్ని సున్నాలాయే. 

డబ్బులు మాత్రం  జాజిపూలలా జలజల రాలు.
 నడక లేని, నిద్రలేని
శరీరాలకు జబ్బులు కాస్త ఎక్కువాయే.
వచ్చేన డబ్బులు 
జబ్బులు ఖాతాలో 
చేరిపోయే. 

వంట ఇంటికి మూత 
బడింది.
పిజ్జా బుజ్జి, బొజ్జలో జేరి ఆడుతుంటే
కడుపులో మంట అంటుకున్నది. 

ఏ మాటకా మాటే ,
నీతోటిదే నేడు ప్రపంచం. 
 నువ్వు ఒక్క క్షణం కన్ను మూస్తే,
అల్ల కల్లోలం.
అవుతుంది లోకం. 
  ఒక్క మాట చిట్ట చివరిగా.
 నీ అంతర్జాల, మాయాజాల గాలములో 
చిక్కిన చేపలము.మేము నీ నీడన బ్రతికే పాపలముతల్లి!
మా కంప్యూటర్ బుల్లి ఓ కల్పవల్లి.

కామెంట్‌లు