మనిషికి తోడునీడ దైవం విశ్వాసం.కానీ మంచిభావాలు సత్ప్రవర్తన కి బీజం పుస్తకం.చేతిలో పుస్తకం మస్తకంలో భావాల్ని తట్టిలేపుతుంది. కాకపోతే పుస్తకాన్ని ఎన్నుకోటంలో మహాజాగ్రత్త వహించాలి.పిచ్చి రెచ్చగొట్టే పుస్తకాలవల్ల బుర్ర కలుషితమవుతుంది.అందుకే బాల్యంలోనే ఓచిన్న కథలపుస్తకం ఇచ్చి దాన్ని చదివించి వారిచేత చెప్పిస్తే పిల్లలు పుస్తకాల పురుగులుగా మారుతారు. ఒంటరిగా ఉన్న వారికి సరదా హాస్యంగా ఉన్న పుస్తకం ఆనందాన్ని ఇస్తుంది.జీవిత చరిత్ర లు చదివితే ఆవ్యక్తుల గొప్పతనం అర్ధమై దిశానిర్దేశం ఏర్పడుతుంది.జి.కె.బుక్స్ బాగా చదివితే ఉపయోగం.
ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత పుస్తకాలగూర్చి తెలుసుకుందాం.
"ది డైవింగ్ బెల్ అండ్ ది బట్టర్ ఫ్లై" అనే పుస్తకం కథ వింటే ఆశ్చర్యం అద్భుతం అనిపిస్తుంది.8డిసెంబర్ 1995లో జీన్ డొమిన్ బాబీ అనే వ్యక్తి హఠాత్తుగా కోమాలోకి వెళ్లిపోయాడు.20రోజుల తర్వాత కాస్త తెలివి వచ్చింది.తల కళ్లు మాత్రమే కదలుతున్నాయి. కానీ ఆయన గొప్పతనం ఏమంటే నిరాశపడకుండా ఓపుస్తకం రాశాడు.ఆయన అసిస్టెంట్ వర్ణమాల చదివేవాడు.ఎబిసిడి..ఇలా చదువుతూ ఉంటే బాబీ తన ఎడంకన్ను రెప్పని ఆర్పేవాడు. తనకు కావల్సిన అక్షరం దగ్గర పదం దగ్గర ఆయన కనురెప్పని చికిలించేవాడు మిటకరించేవాడు.ఒక పదం చెప్పడానికి 2 లక్షలసార్లు కనురెప్ప కదిలించేవాడు. అలా ఆపుస్తకాన్ని కనురెప్ప తో చెప్పి లోకానికి అందించాడు. ఆయనకు అలా సాయంచేసిన వ్యక్తికి ఆయన అసిస్టెంట్ ని మనం అభినందించాలి.అలా మన శారీరక లోపాన్ని అధిగమించి కొత్త లోకానికి తలుపులు తెరవాలి.
1924లో తొలి క్రాస్ వర్డ్ పజిల్ బుక్ యు.ఎస్.ఎ.లో పబ్లిష్ ఐంది."ది న్యూయార్క్ వరల్డ్" అనే న్యూస్ పేపర్ లో ప్రచురితమైన పజిల్స్ ని ఏర్చి కూర్చిన క్రాస్వర్డ్ పజిల్ పుస్తకం.మన పేపర్లలో పదబంధం గా ఆదివారం అనుబంధాలలో వస్తున్నాయి.పాఠ్యపుస్తకాలలో కూడా ఇలా ప్రవేశపెడితే ఆసక్తి ఉత్సాహంతో పిల్లలు నేరుస్తారు.జి.కె.జ్ఞాపకశక్తి పెరిగి చెత్త ఆలోచనలు బుట్టదాఖలవుతాయి.
జపాన్ రచయిత రుహో ఒకావా 2009నవంబర్ నుంచి2010 నవంబర్ మధ్య కాలంలో 52 పుస్తకాలు రాసి పబ్లిష్ చేశాడు. "హ్యాపీ సైన్స్" అనే ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. ఆయన 500పుస్తకాలు ప్రచురించాడు.మరి పాఠకులు ఎందరెందరో మెచ్చారు.ఇలాంటి విషయాలు చదువుతుంటే పుస్తకాల గొప్పతనం తెలుస్తుంది కదూ?🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి