అమ్మలోని కమ్మదనము :-వంక హనీష్, ఎనిమిదవ తరగతి -ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రాజ్ భవన్, సోమాజిగూడ,-హైదరాబాద్, 500041.-చరవాణి :9848518597.
 అనగనగా ఒక ఊరు. ఆ ఊరు  పేరు శివునిపల్లె. ఇది ఏడుపాయలకు దగ్గరగా ఉంటుంది. అదే గ్రామంలో  శివయ్య, పార్వతమ్మ జీవనము సాగిస్తున్నారు.వీరికి ముద్దుల కుమారుడు గణాధీశుడు ఉన్నాడు. ఇతడు తల్లి దండ్రులతో ప్రేమగా గడిపేవాడు. ఇతనికి అమ్మంటే చాలా ఇష్టం.హాఠాత్తుగా అమ్మ కు మూర్చవ్యాధి వచ్చి చనిపోయింది. గణాధీశుడు అమ్మ లేని లోటుతో చాలా క్రుంగిపోతున్నాడు. ఇలా బాధ పడుతున్న కొడుకు గురించి బాగా అలోచించి తల్లి ప్రేమను ఎలా తీర్చగలను అని శివయ్య  మళ్ళీ పెళ్లి గంగమ్మను చేసుకున్నాడు.రెండు సంవత్సరాల తర్వాత గంగమ్మ కు కవలలు(ఆడబిడ్డ, మగపిల్లవాడు ). గంగమ్మ తనకు పుట్టిన పిల్లతో పాటు గణాధీశుడు ను చాలా ప్రేమగా చూసుకునేది. గణాధీశుడు నువ్వు మా అమ్మవు కాదుపో అని చిదరించుకోవడం, పెట్టిన అన్నం తినక పోవడం చేశాడు.ఈ విధంగా చేస్తూ ఉంటే తండ్రి శివయ్యకు కోపం వచ్చి గణాధీశుడిని బాగా కొడుతుంటే గంగమ్మ కొట్టకుండా కాపాడింది. అమ్మ విలువ అప్పుడు అర్థం అయి అమ్మ చెప్పినట్లు వినడం, అమ్మ పెట్టింది తినడం చేశాడు  గణాధీశుడు. ఈ విదంగా శివయ్య, గంగమ్మ పిల్లలను విద్యా బుద్దులతో పెద్ద వాళ్ళను చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. గణాధీశుడు కలెక్టర్ అయ్యారు, దామోదర్, సుమిత్ర ఇద్దరు డాక్టర్లు అయ్యారు.

నీతి :తల్లి మనలని కన్నా కనక పోయిన కమ్మని ప్రేమను చూపెట్టిన వారెవరైనా అమ్మనే.




కామెంట్‌లు
Vojjala Sharath babu చెప్పారు…
హనీశ్ చక్కని ప్రయత్నం చేసావు. బాగుంది నాని! అభినందనలు. ఇంకా ఇలాంటివి రాస్తూండు.